Sri Sri Vyasaraya Pratisthita Kaluva Gadda Sri Anjaneya swami Devasthanam

0


      Vyasaraya Pratisthit   Kaluva Gadda Sri Anjaneya Swami Devasthanam

                     kothacheruvu.Sri Sathya Sai District Pin code: 515133    శ్రీ వ్యాసరాయ ప్రతిష్ఠిత హనుమ దేవస్థానం,kothacheruvu, KTC-BKP Road, Kothacheruvu, Andhra Pradesh 515133.


                


                                   శ్రీ వ్యాసరాయ ప్రతిష్ఠిత హనుమ దేవస్థానం
kothacheruvu,  KTC-BKP Road, Kothacheruvu, Andhra Pradesh 515133.

కాలవగట్టు/కాలువగడ్డ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పుట్టపర్తి సమీపంలోని కొత్తచెరువు పట్టణంలో ఉంది.  ఇది అతి పురాతన దేవాలయం.  ముఖ్యంగా ఈ స్వామి విగ్రహానికి 3 అడుగులతో ఉన్న ఈ విగ్రహానికి ప్రత్యేకత ఉంది.  మధ్వ తేగా వేదాంత ప్రధాన ఆచార్య  పరమహంస .  శ్రీ వ్యాస రాయ/ వ్యాస రాజ హనుమంతుడిని దైవిక శక్తితో ప్రతిష్టించారు.  స్వామివారి తల సంప్రదాయ ఉత్తరం వైపు ముఖం తిప్పినట్లు  కనిపిస్తుంది. నవంబరు 25, 1905న మధ్వ తేగా కు చెందిన  బ్రహ్మచారి శ్రీ బేలూరి వేంకటేశ్వరాచార్యులు  ఈ స్వామిని వెలుగులోకి తెచ్చి దీపారాధన నైవేద్య వ్యవహారాలు చూసేవారు. కొన్ని పండ్ల చెట్లు పెట్టి మరియు  పొంగలి ,స్వామి వారి కి  నైవేద్యం చేస్తుండేవారు . పండ్లు మరియు పొంగలి  కొన్ని వానరాలు(కోతులు) కు పెటేవాడు  . ప్రక్కన కాలవ ఉంది. అంతకుముందు కంప చెట్లు శిథిలావస్థలో ఉన్న దేవస్థాన వేంకటేశ్వరాచర్యులు వారు ఒక పద్దతి ప్రకారం తేవడం జరిగింది . వారి నిర్యాణం తర్వాత ఈ ఆలయాన్ని పట్టించుకునే వారు లేక చాలా సంవత్సరాలు పూజలు చేయలేదు. 1968 సంవత్సరంలో స్థానిక ఆర్చకులు భాస్కర వంశస్థులు వారు చుస్తుండేవారు  అక్కడికి వెళ్ళి  పూజ దీపారాధ చేస్తుండేవారు. కొంతమంది  భక్తులు , ఊరి పెద్దలు .సహకారంతో 1986 సంవత్సరం నుంచి ఆలయం అభివృద్ధి చెందుతు వస్తుంది . అప్పుడప్పుడు ఈ స్వామి కి ఒక దేవతా సర్పం  వస్తుంటుంది ఈ స్వామి ధర్మించేందుకు అని స్థానికలు చెబుతుంటారు  కాలువగట్టు కాలక్రమేణా కాలువగడ్డ అనే పేరు ఏర్పడింది.

  

              ఓం నమో శ్రీ ఆంజనేయం .

పల్లవి

ఈశ్వరాంశమునందు బుట్టిన ఈదకొమరుండీతడు  

శాశ్వతముగా కాల్వగడ్డపై స్థిరమైన ఆంజనేయుడు 

చ.1.

ఐదు శతాబ్దాలకు ముందుగానే వెలసియున్న వేలుపితడు

నెయ్యముతో నభము భువియును నిలచియున్నవాడు 

కయ్యమాడిన లంకవాసుల కావరమునణచినాడు 

దయ్యముల భూతముల పాలిటి దర్పమణచిన ధీరుడు 

ఈశ్వరాంశమునందు . సాహిత్యం -( సామవేదం వేంకటమురళీకృష్ణ.)./ కొత్తచెరువు  కాలువగడ్డ శ్రీ ఆంజనేయ స్వామి (. కొత్తచెరువు .) పుట్టపర్తి .


ప్రముఖ అవధాని శ్రీ సామవేదం వెంకటమురళికృష్ణ గారు  కొత్తచెరువు శ్రీ కాలవగట్టు/కాలువగడ్డ శ్రీ ఆంజనేయ స్వామి వారి గురించి ప్రస్తావిస్తు రచించారు  ( కొత్తచెరువు), పుట్టపర్తి .

  

 ఓం నమో శ్రీ ఆంజనేయం ..

పల్లవి.

మంగళమయ్య మారుతినందన మంగళము జయ మంగళము

మంగళము మహిమాన్వితమూరితి మంగళము శుభ మంగళము 

చ.1.

కొత్తచెరువుపై కాల్వగడ్డపై కలిలో వెలసిన రామబంటునకు

చిత్తమునుండి చింతలు దీర్చెడి చిన్మయునకును మంగళము

అత్తల ఇత్తల హరిహర రూపమునారామునిగా దర్శించువానికి  

ఉత్తమమైన లోకములొసగెడి ఉన్నతోన్నతునకు మంగళము

మంగళమయ్య కేసరినందన..

సాహిత్యం - సామవేదం వేంకటమురళీకృష్ణ.



ఓంనమో శ్రీ ఆంజనేయం

పల్లవి.

మంగళమయ్య మారుతినందన మంగళము జయ మంగళము

మంగళము మహిమాన్వితమూరితి మంగళము శుభ మంగళము 

చ.2.

వ్యాసరాయని వేడుకొనగా వేంచేశిన వాయుపుత్రుడు 

ధ్యాస రాముని పైన నిలిపిన దేవదేవుని దాసుడు

లేశమంతయు భయము లేకను లంక గాల్చిన లెంకవీడు  

క్లేశహరుడై కలిని రాముని కారుణ్యము నుడివినాడు

ఈశ్వరాంశమునందు...

సాహిత్యం - సామవేదం వేంకటమురళీకృష్ణ.


ఓంనమో శ్రీ ఆంజనేయం .

పల్లవి:
కొత్తచెరువు కాల్వగడ్డ ఘన హముమంతుడు
చిత్తములో తలచినంత చింతలన్ని దీర్చువాడు

చ.1.
ఇభరక్షక దాసుడైన ఈశ్వరాంశ సంభూతుడు
శుభములన్ని యొసగువాడు సంజీవరాయుడు 
ప్రభాకరుని దివ్యతేజస్సుతో ప్రపంచమున తిరుగువాడు
అభయ వరదాయకుని ఆత్మలోనె నిలపువాడు.

కొత్త చెరువు.




                             





     

Every day Temple Opening  time: 6:00 am

   Temple closing time:  8:00 pm

TIMES MORNING    SU    MO   TU   WE   TH    FR  SA     EVENING CLOSING TIME
6:00 AM 
       
 8:00 PM

6:00 AM        
 8:00 PM

6:00 AM                    8:00 PM


6:00 AM 
    


 



                                             

                  శ్రీ వ్యాసరాయ ప్రతిష్ఠిత హనుమ దేవస్థానం,kothacheruvu, KTC-BKP Road, Kothacheruvu, Andhra Pradesh 515133.





Post a Comment

0Comments
Post a Comment (0)
Counters